అక్షరటుడే, వెబ్డెస్క్ : NEET Exam Scam | నీట్ పరీక్షలో భారీ స్థాయిలో మోసాలు జరిగాయని కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) ఆరోపించారు. పేపర్ లీకేజీపై కఠిన చర్యలు తీసుకోవాని డిమాండ్ చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తిరువనంతపురంలో గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్ మాట్లాడుతూ.. కేరళం (Keralam) దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచే ఒక ప్రభుత్వ విద్యా విధానాన్ని నిర్మించిందన్నారు. ఇప్పుడు ఆ పురోగతిని వెనక్కి మళ్లించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
NEET Exam Scam | ఎస్ఎఫ్ఐ చురుకైన పాత్ర
ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థి, యువజన ఆందోళనల్లో SFI చురుకైన పాత్ర పోషిస్తోందని విజయన్ అన్నారు. నీట్ 25 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యే పరీక్ష అని తెలిపారు. ఈ పరీక్ష కుంభకోణం వెనుక ఒక మాఫియా ఉందని ఆరోపించార. ఏదో కారణం చేత, ఈ కుంభకోణానికి సూత్రధారులుగా ఉన్న నేరస్తుల పేర్లు, వివరాలను బహిర్గతం చేయడం లేదన్నారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసుల లాఠీచార్జీని ఆయన ఖండించారు.
NEET Exam Scam | కాంగ్రెస్ ఎక్కడ..
నీట్ పరీక్ష విషయంలో జరుగుతున్న ఆందోళనలలో కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎక్కడా కనిపించడం లేదని పినరయి విజయన్ విమర్శించారు. NSUI ఎందుకు ఈ నిరసనలో పాల్గొనడం లేదని ప్రశ్నించారు. ఇంతకాలం కాంగ్రెస్ ఈ ఆందోళనకు దూరంగా ఉండటం తప్పే అయినప్పటికీ, చివరకు రాహుల్ గాంధీ నాయకత్వంలో నిరసన తెలిపేందుకు ముందుకు రావడం మంచి పరిణామం అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి కూడా తన బాధ్యత నుంచి తప్పించుకోలేరన్నారు.
#WATCH | Thiruvananthapuram, Keralam | Student Federation of India holds march to Lok Bhavan demanding the resignation of Union Education Minister Dharmendra Pradhan. pic.twitter.com/QgyMbEOmDm
— ANI (@ANI) July 23, 2026
దీనిని కూడా చదవండి : Mutyam Venkataramana Remand | రూ.300 కోట్ల అక్రమాస్తులు.. డీఈ వెంకటరమణకు రిమాండ్