అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి పలు దేశాలపై టారిఫ్‌లు విధించారు. 60 దేశాలకు కొత్త సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
భారత్ సహా 60 దేశాలపై 10 నుంచి 12.5 శాతం వరకు కొత్త సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ తెలిపారు. ట్రేడ్ యాక్ట్ 1974లోని ‘సెక్షన్ 301’ ప్రకారం కొత్త టారిఫ్‌లు అమలులోకి వస్తాయన్నారు. ఈ దేశాల నుండి దిగుమతులపై యునైటెడ్ స్టేట్స్ 10 శాతం నుండి 12.5 శాతం వరకు పన్నులు విధిస్తుంది. అమెరికన్లు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అధ్యక్షుడు చేపట్టిన విస్తృత ప్రచారంలో ఇది ఒక భాగమని విమర్శకులు అంటున్నారు. గతంలో ట్రంప్ విధించిన సుంకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తాత్కాలిక పన్నులు విధించారు. వాటి గడువు నేటితో ముగియనుండటంతో మరోసారి పన్నులు విధిస్తున్నట్లు ప్రకటించారు.
Trump Tariffs | వెట్టి చాకిరి ద్వారా
కార్మికులతో బలవంతంగా (వెట్టి చాకిరితో) ఉత్పత్తి చేసిన వస్తువుల దిగుమతులపై సరైన నిషేధం విధించడం లేదనే ఆరోపణలతో ట్రంప్ ఈ సుంకాలను విధించారు. భారత్‌పై సైతం మొదట 12.5శాతం సుంకాలు విధించాలని అగ్రరాజ్యం భావించింది. అనంతరం వెట్టి చాకిరి నిర్మూలన చట్టాలు సమర్థవంతంగా అమలు చేస్తుండటంతో 10 శాతానికి తగ్గించింది. భారతదేశం, శ్రీలంక, యూరోపియన్ యూనియన్‌తో సహా, అటువంటి చట్టాలను అమలు చేసిన దేశాలు వాటిని అమలు చేయడంలో విఫలమైతే 10 శాతం సుంకాలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Trump Tariffs | అర్ధరాత్రి నుంచి..
తాజా సుంకాలు శుక్రవారం తెల్లవారుజామున 12:01 గంటలకు (యూఎస్ కాలమానం ప్రకారం) అమల్లోకి వస్తాయి. అదే సమయానికి ఆయన గతంలో విధించిన తాత్కాలిక 10 శాతం దిగుమతి పన్ను గడువు ముగుస్తుంది. ఏప్రిల్ 2025లో ట్రంప్ ప్రవేశపెట్టిన “లిబరేషన్ డే” సుంకాలను రద్దు చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఆయన ఆ సుంకాలను ప్రవేశపెట్టారు. ట్రంప్ ప్రభుత్వం కొన్ని వారాల్లోనే మరో విడత సుంకాలను ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..: Generic Drug Tariffs | జెనరిక్ మందులపై సుంకాలు.. ట్రంప్ సంచలన ప్రకటన