Chennai Love Story Review | చెన్నై లవ్ స్టోరీ మూవీ ఎలా ఉందంటే?

కిరణ్​ అబ్బవరం హీరోగా నటించిన చెన్నై లవ్​స్టోరీ ఢిపరెంట్ ప్రేమకథ. ఈ సినిమా రివ్యూ..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Chennai Love Story Review | కిరణ్​ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన చెన్నై లవ్​స్టోరీ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే కిరణ్ నటించిన ఈ లవ్​ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

బేబీ సినిమాతో హిట్​ కొట్టిన దర్శకుడు సాయి రాజేశ్​ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. కిరణ్ అబ్బవరం సరసన హీరోయిన్​గా గౌరీప్రియ నటించింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ప్రస్తుత జనరరేషన్​ను ఆకట్టుకునేలా ప్రేమకథను మలచడంలో డైరెక్టర్​ సఫలం అయ్యాడు.

Chennai Love Story Review | కథ ఏమిటంటే..

నివి (శ్రీగౌరి ప్రియ‌) తాను ప్రేమించిన అబ్బాయి అజయ్​తో వివాహానికి సిద్ధం అవుతోంది. అయితే పెళ్లి సమయంలో అతడు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెబుతాడు. నివికి బ్రేకప్​ చెప్పి వెళ్లిపోతాడు. దీంతో నివి తీవ్ర మనస్తాపం చెందుతోంది. బ్రేకప్​ బాధతో మందుకు బానిస అవుతుంది. అనంతరం ఆమెను స్నేహితులు చెన్నై తీసుకు వెళ్తారు. అక్కడ హీరో స్టివెన్​ శంకర్​ (కిరణ్​ అబ్బవరం) ఆమెకు పరిచయం అవుతాడు. అనాథ అయిన శంకర్​ డైరెక్టర్​ కావడానికి చెన్నై వెళ్లాడు. నివి వాళ్లతో పాటే ఉంటాడు. ఈ క్రమంలో వారిద్దరు ప్రేమించుకుంటారు. అంతలో అజయ్​ మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడు. ఆ తర్వాత ఏ జరిగిందో తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Chennai Love Story Review | నిదానంగా..

సినిమా మొదట్లో నెమ్మదిగా సాగుతోంది. అయితే తొలి ప్రేమతో ఆగిపోకుండా.. జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్లాలనే పాయింట్​ చుట్టూ డైరెక్టర్​ కథను తిప్పాడు. మంచి ప్రేమ ఎక్కడుందో వెతుక్కోవాలని చూపెట్టాడు. ఇంటర్వెల్​ ముందు సినిమా బాగుంటుంది. హీరో హీరోయిన్​ మధ్య ప్రేమ చిగురించాక కథ పరిగెడుతుంది. సెకండాఫ్​ లో డైరెక్టర్​ కాస్తా తడబడ్డాడు. క్లైమాక్స్​ సీన్​ భావోద్వేగ భరితంగా ఉంటుంది. మొత్తంగా సినిమా పర్వాలేదు. కిరణ్​ అబ్బవరం, గౌరీప్రియ తమ నటనలో ఆకట్టుకున్నారు. ఫస్టాఫ్​లోని సెంటిమెంట్​ సీన్స్​ కట్టిపడేస్తాయి. అయితే కథ నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్​ పాయింట్​.

ఇది కూడా చదవండి..: Basinga Balaalu Song | సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘బాసింగ బలాలూ’.. నెల రోజుల్లో 47 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో రికార్డుల ధమాకా!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *