అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | పశ్చిమాసియాలో జియో పొలిటికల్ టెన్షన్స్‌తో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు వంద డాలర్లు దాటింది. దీనికి ట్రంప్ టారిఫ్‌లు తోడయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్లు రక్తమోడుతున్నాయి. అన్ని రంగాలలో అమ్మకాల ఒత్తిడి కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో సెషన్‌లోనూ నష్టాల బాటలో పయనిస్తోంది.
Stock Market | భారీ నష్టాలతో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 683 పాయింట్ల డిస్కౌంట్‌తో మొదలై మొదట 287 పాయింట్లు పైకి ఎగబాకింది. ప్రాఫిట్ బుకింగ్‌తో అక్కడినుంచి 521 కోల్పోయింది. నిఫ్టీ 223 పాయింట్ల భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమైనా.. 97 పాయింట్లు పెరిగి కోలుకుంటున్నట్లు కనిపించింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద లాభాల స్వీకరణతో మరో 157 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.50 ప్రాంతంలో సెన్సెక్స్ 591 పాయింట్ల నష్టంతో 75,799 వద్ద, నిఫ్టీ 166 పాయింట్ల నష్టంతో 23,703 వద్ద ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లో నమోదైన కంపెనీల సంపద విలువ సుమారు 4 లక్షల కోట్ల మేర ఆవిరైంది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 8 స్టాక్స్ లాభాలతో, 22 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్ 0.50 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.36 శాతం, ట్రెంట్ 0.32 శాతం, ఐటీసీ 0.30 శాతం, అదానీపోర్ట్స్ 0.13 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎటర్నల్ 3.07 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.91 శాతం, ఇన్ఫోసిస్ 2.76 శాతం, ఎం అండ్ ఎం 2.35 శాతం, ఇండిగో 2.06 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Adani Airline Business | విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్.. క్లారిటీ ఇచ్చిన సంస్థ