అక్షరటుడే వెబ్‌డెస్క్: ICICI Prudential Results | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ప్రముఖ బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 27.8 శాతం పెరిగి రూ. 386 కోట్లకు చేరినట్లు సంస్థ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ. 302 కోట్లుగా మాత్రమే ఉండేది.
ICICI Prudential Results | రూ. 3.34 లక్షల కోట్లు..
నికర ప్రీమియం ఆదాయం రూ. 8,503 కోట్ల నుంచి రూ. 9,749 కోట్లకు పెరిగింది. న్యూ బిజినెస్ ప్రీమియం 21 శాతం వృద్ధి చెంది రూ. 4,012 కోట్ల నుంచి రూ. 4,866 కోట్లకు చేరింది. 2026 జూన్ 30 నాటికి సంస్థ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 3.34 లక్షల కోట్లుగా నమోదైంది. అలాగే సంస్థ నికర విలువ రూ. 14,375 కోట్లుగా ఉంది.
ICICI Prudential Results | కంపెనీ పేరు మార్పు ప్రతిపాదన..
జులై 6న జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో కంపెనీ పేరును ‘ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్’గా మార్చాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు త్వరలో బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ (IRDAI) నుంచి అనుమతి లభించాల్సి ఉంది. “మా సంస్థ పటిష్టత, విశ్వసనీయత, వారసత్వాన్ని ఈ కొత్త పేరు ప్రతిబింబిస్తుంది” అని కంపెనీ ఎండీ, సీఈవో అనూప్ బాగ్చీ తెలిపారు.
ఇది కూడా చదవండి: Kamareddy Police | వంతెనపై నుంచి దూకేందుకు వ్యక్తి యత్నం.. కాపాడిన కానిస్టేబుల్