Himachal Taxi Accident | ఘోర విషాదం.. కొండచరియల కింద టాక్సీ నుజ్జునుజ్జు.. 13 మంది దుర్మరణం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Himachal Taxi Accident | హిమాచల్ ప్రదేశ్‌ Himachal Pradesh లో ప్రకృతి మరోసారి తన ఉగ్రరూపాన్ని చూపించింది. లాహౌల్–స్పితి జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబాలకు చెందిన ఆశలు క్షణాల్లో ఆవిరయ్యాయి. కొండపై నుంచి విరిగిపడిన భారీ బండరాళ్లు టాటా సుమో టాక్సీపై పడటంతో అందులో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ శిశువు కూడా ఉండటం మరింత విషాదాన్ని నింపింది.

Himachal Taxi Accident | రాకపోకల నిలిపివేత..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంబా జిల్లాలోని దూరప్రాంతమైన పాంగీ ప్రాంతానికి చెందిన ప్రయాణికులు ఉడైపూర్–కిల్లార్ రహదారిపై టాక్సీలో స్వగ్రామాలకు బయలుదేరారు. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో అధికారులు ఈ రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు టిండి ప్రాంతంలో రాత్రి బస చేసి, పరిస్థితి కాస్త మెరుగుపడిందని భావించి మరుసటి రోజు ప్రయాణం కొనసాగించారు.

అయితే కడు నల్లా సమీపానికి చేరుకోగానే కొండపై నుంచి భారీ బండరాళ్లు ఒక్కసారిగా టాక్సీపై విరిగిపడ్డాయి. బండరాళ్ల కింద వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో అందులో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

Ravneet Singh Bittu | రవ్​నీత్ సింగ్ బిట్టూ రాజీనామా..ఎందుకంటే..

Himachal Taxi Accident | సీఎం దిగ్భ్రాంతి..

ఈ ప్రమాదంపై పాంగీ–భర్మౌర్ ఎమ్మెల్యే డాక్టర్ జనక్ రాజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారంతా పాంగీ ప్రాంతానికి చెందిన వారేనని, వారి కుటుంబాలకు ఇది తీరని విషాదమని తెలిపారు.

ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించాలని లాహౌల్–స్పితి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *