CJP Protest Ends | నిరసనను విరమించిన సీజేపీ.. కేసులు ఉండవని కేంద్రం హామీ

కాక్రోచ్ జనతా పార్టీ తన నిరసనను తక్షణమే విరమిస్తున్నట్లు ప్రకటించింది. జంతర్ మంతర్ వద్ద ఉన్న తమ మద్దతుదారులను ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CJP Protest Ends | ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తన నిరసనను తక్షణమే విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉన్న తమ మద్దతుదారులను ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరింది.

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేసిన తర్వాత.. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. సుమారు 3 గంటల పాటు చర్చల అనంతరం ప్రభుత్వం, CJP సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. కేంద్ర మంత్రులు జె.పి. నడ్డా, జితేంద్ర సింగ్‌ల సమక్షంలో మాట్లాడిన CJP ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందనే “సద్భావనతో” నిరసనను విరమిస్తున్నట్లు తెలిపారు.

CJP Protest Ends | విద్యార్థుల కుటుంబాలకు పరిహారం

తమ డిమాండ్​లలో ఒకటి ఇప్పటికే నెరవేరిందని వారు తెలిపారు. విద్యార్థులపై నమోదైన పోలీసు కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోమని, పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం గరిష్ట పరిహారం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు.

CJP Protest Ends | ఇళ్లకు వెళ్లాలి

ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించినందున నిరసనకారులందరూ ఇళ్లకు వెళ్లాలని సౌరవ్ దాసు కోరారు. అశుతోష్ రంకా మాట్లాడుతూ, 36 రోజుల నిరసన తర్వాత ప్రభుత్వం డిమాండ్లన్నింటినీ అంగీకరించిందన్నారు. నిరసన ప్రదేశాల నుండి శాంతియుతంగా వైదొలగాలని ఆయన కోరారు.

దీనిని కూడా చదవండి : Krishna River Flood | కృష్ణా నదికి వరద.. రైతుల్లో ఆశలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *