అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Rain Alert | తెలంగాణలో నేటి నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. ఆదివారం ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో మూడు రోజులుగా వాతావరణం పొడిగా ఉంది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో మోస్తరు వాన పడింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ (Medak), సిద్దిపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడుతాయి.
Telangana Rain Alert | వెంకటాపూర్‌లో అత్యధికం
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి వాన దంచి కొట్టింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 24 గంటల్లో ములుగు జిల్లా వెంకటాపూర్‌లో అత్యధికంగా 56.8 మి.మీ. వర్షం కురిసింది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ 43.3, పెద్దపల్లి జిల్లా ఓదెల 37, వేములవాడ 36.3, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ 34.3, మెదక్ జిల్లా హవేళి ఘన్పూర్ (Haveli Ghanpur)లో 28.5, కరీంనగర్ జిల్లా దుర్శేడ్‌లో 27.3, కామారెడ్డి జిల్లా పాల్వంచలో 25.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
దీనిని కూడా చదవండి : Jantar Mantar Protest | జంతర్‌మంతర్ వద్ద సాధారణ పరిస్థితులు..పునరుద్ధరించిన ఇంటర్నెట్ సేవలు