Kukatpally Accident | బైక్​ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kukatpally Accident | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సెలవు కావడంతో స్నేహితులతో క్రికెట్ ఆడటానికి బైక్​పై బయలు దేరిన మైనర్లను లారీ ఢీకొంది.

సరదాగా క్రికెట్ ఆడేందుకు ముగ్గురు స్నేహితులు ఆదివారం తెల్లవారుజామున బయలు దేరారు. వారిని టిప్పర్​ లారీ ఢీకొంది. దీంతో మహేశ్ (17), లక్ష్మీ తేజ్ (17) అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడికి అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Kukatpally Accident | డ్రైవర్​ అరెస్ట్..

ప్రమాదానికి కారణం అయిన లారీ డ్రైవర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమా.. లేక లారీ డ్రైవర్​ నిర్లక్ష్యమా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా బైక్​పై వెళ్తున్న ముగ్గురు మైనర్లు కావడం గమనార్హం.

దీనిని కూడా చదవండి : July 26 Gold Prices | తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *