Balakrishna Health Update | బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Balakrishna Health Update | హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ వాకర్ సహాయంతో నడుస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.

Balakrishna Health Update | షూటింగ్ సమయంలో గాయం..

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ 111వ సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్ ప్రాంతంలో జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో కాలు జారి పడటంతో ఆయన ఎడమ మోకాలికి కండరాల గాయమైంది. వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించింది. మెరుగైన వైద్యం కోసం అనంతరం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.

ఇది కూడా చదవండి:  Hormuz Strait Talks | హర్మూజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్, ఒమన్ చర్చలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *