అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vaibhav Suryavanshi Innings | జింబాబ్వేతో జరిగిన మూడో టీ 20లో భారత్ (Bharat) ఘన విజయం సాధించింది. భారత ఓపెనర్, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది.
మూడో టీ 20లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆది నుంచే భారత బుడ్డోడు వైభవ్ జింబాబ్వే (Zimbabwe) బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (2) మరోసారి విఫలం అయిన సూర్యవంశీ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 49 బంతుల్లో 81 పరుగులు చేశాడు. అందులో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. వైభవ్ 102 మీటర్ల భారీ సిక్సర్ కొట్టడం గమనార్హం. ఇషాన్ కిషన్ (Ishan Kishan) 29, శ్రేయస్ అయ్యార్ 27 పరుగులతో రాణించారు. చివర్లో రింక్ సింగ్ 14 బంతుల్లో 25 పరుగులు చేశాడు. దీంతో భారత్ 192 పరుగులు చేసింది.
Vaibhav Suryavanshi Innings | తడబడ్డ జింబాబ్వే
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఆదిలోనే వికెట్ కోల్పోయింది. తొలి బంతికే ఓపెనర్ బెన్నెట్ ఔట్ అయ్యాడు. కురన్ 20, మేయర్స్ 19 పరుగులతో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ర్యాన్ బుర్ల్ 54 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లో మయాంక్ యాదవ్ 3, యష్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు. దీంతో జింబాబ్వే 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. భారత జట్టు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Vaibhav Suryavanshi smashes splendid 102m six in ZIM vs IND 2026 3rd T20I pic.twitter.com/9YCG0ON2ZT
— Cricket Hub (@Anurag9793) July 26, 2026
దీనిని కూడా చదవండి : Komuravelli Railway Station | కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం.. తీరనున్న భక్తుల కష్టాలు