అక్షరటుడే, వెబ్‌డెస్క్: NTR Shoulder Injury | ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్ భుజానికి స్వల్ప గాయమైనట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. సోమవారం సాయంత్రం ఈ గాయం కావడంతో వెంటనే వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.
NTR Shoulder Injury | ఆరు – ఎనిమిది వారాలపాటు విశ్రాంతి
డా. జె. మధుసూదన్‌రావు, డా. ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్య బృందం ఎన్టీఆర్‌కు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. పరీక్షల అనంతరం పూర్తిగా కోలుకునేందుకు ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.
ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. కోలుకునే ప్రక్రియకు సంబంధించిన వివరాలను అవసరమైనప్పుడు వెల్లడిస్తామని పేర్కొంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని, త్వరలోనే పూర్తిగా కోలుకుని సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.