అక్షరటుడే, వెబ్‌డెస్క్: China Earthquake | చైనా (China)లోని క్వింగ్హై ప్రావిన్స్‌లో మంగళవారం వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. హైనాన్ టిబెటన్ అటానమస్ ప్రిఫెక్చర్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. అమెరికా భూకంప పరిశీలనా సంస్థ (USGS) వివరాల ప్రకారం, రెండు భూకంపాల తీవ్రత కూడా రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది.
China Earthquake | కేవలం 18 నిమిషాల వ్యవధిలోనే..
మొదటి భూకంపం భారత కాలమానం ప్రకారం ఉదయం 8:46 గంటలకు సంభవించగా, రెండో భూకంపం ఉదయం 9:04 గంటలకు నమోదైంది. రెండు భూకంపాల మధ్య కేవలం 18 నిమిషాల వ్యవధి మాత్రమే ఉండటం గమనార్హం.
భూకంపాల ప్రభావంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురైనట్లు సమాచారం. అయితే ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇప్పటివరకు వెల్లడికాలేదు. పరిస్థితిని స్థానిక అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
China Earthquake | యూరేషియన్ టెక్టానిక్ ఫలకాల నిరంతర కదలికలు
రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో సంభవించే భూకంపాలు సాధారణంగా మోస్తరు నుంచి బలమైన ప్రకంపనలుగా పరిగణిస్తారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, భవనాలు భూకంప నిరోధక ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే గోడలు పగిలిపోవడం, భవనాలకు స్వల్పం నుంచి మోస్తరు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. వరుస భూకంపాల అనంతరం ఆఫ్టర్‌షాక్స్ (తదుపరి ప్రకంపనలు) వచ్చే అవకాశం కూడా ఉంటుందని భూకంప శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
టిబెటన్ పీఠభూమి పరిసర ప్రాంతం భూకంపాల పరంగా సున్నితమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. భారతీయ, యూరేషియన్ టెక్టానిక్ ఫలకాల నిరంతర కదలికల కారణంగా ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు నమోదవుతుంటాయి. అందువల్ల స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని విపత్తు నిర్వహణ నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Seattle Food Festival | యూఎస్ ఫుడ్ ఫెస్టివల్లో కాల్పులు.. ఇద్దరు మృతి