Simhadri Giripradakshina | ప్రారంభమైన సింహాచల గిరిప్రదక్షిణ.. భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు

విశాఖ సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ ఇవాళ వైభవంగా ప్రారంభమైంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Simhadri Giripradakshina | విశాఖ ( Visakhapatnam )సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ ఇవాళ వైభవంగా ప్రారంభమైంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తొలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి భక్తులు తమ ప్రదక్షిణను ఆరంభిస్తున్నారు. కొండ చుట్టూ సుమారు 32 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకుని రేపు ఉదయానికి వీరంతా తిరిగి అప్పన్న ఆలయానికి చేరుకోనున్నారు.

Simhadri Giripradakshina | ఉచిత బస్సు సౌకర్యం..

ఈసారి గిరిప్రదక్షిణకు 10 లక్షలకు పైగా భక్తులు వస్తారని జిల్లా అధికార యంత్రాంగం అంచనా వేసింది. ఇందుకు తగినట్లుగానే సింహాచలం దేవస్థానం భారీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రదక్షిణ దారి పొడవునా ప్రభుత్వం అన్ని వసతులు కల్పించింది. అంతేకాకుండా, ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు, నేడు , రేపు భక్తులకు అప్పన్న ఉచిత దర్శనం లభించనుంది.

Simhadri Giripradakshina | గిరిప్రదక్షిణ విశిష్టత..

ప్రతి సంవత్సరం  ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ గిరిప్రదక్షిణ అత్యంత వైభవంగా జరుగుతుంది. సింహాచలం కొండ చుట్టూ 32 కిలోమీటర్లు కాలినడకన ప్రదక్షిణ చేయడం ద్వారా భూప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని, సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

ఇది కూడా చదవండి:  Supreme Court | నీట్​ నిరసనల్లో పోలీసుల తీరుపై విచారణ అవసరం: సుప్రీంకోర్టు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *