NEET Paper Leak Case | నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో కీలక ముందడుగు..13 మంది నిందితులపై సీబీఐ ఛార్జ్‌షీట్‌

పేపర్‌ లీక్‌ కుట్ర, పరీక్ష నిర్వహణలో అక్రమాలు, ఇతర సంబంధిత అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NEET Paper Leak Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ (NEET) పేపర్‌ లీక్‌ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) 13 మంది నిందితులపై ఛార్జ్‌షీట్‌ను సంబంధిత కోర్టులో దాఖలు చేసింది.

NEET Paper Leak Case | పరీక్ష నిర్వహణలో అక్రమాలు

దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సాక్ష్యాల ఆధారంగా నిందితుల పాత్రపై సీబీఐ ఛార్జ్‌షీట్‌లో వివరాలు పొందుపరిచినట్లు సమాచారం. పేపర్‌ లీక్‌ కుట్ర, పరీక్ష నిర్వహణలో అక్రమాలు, ఇతర సంబంధిత అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేసిన సీబీఐ, పలు రాష్ట్రాల్లో దర్యాప్తు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించింది. ఛార్జ్‌షీట్‌ దాఖలుతో కేసు విచారణ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.

Nizamabad Rice Scam | రెండు లక్షల క్వింటాళ్ల ప్రభుత్వ ధాన్యం మేసిన ప్రముఖ వ్యాపారి కాపర్తి శ్రవణ్! రూ.66 కోట్ల ప్రజాధనం మింగేశాడుగా!

నీట్‌ పరీక్షల పారదర్శకత, అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కేసులో సమగ్ర విచారణ కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *