అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌షా (Amit Shah) బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యల్లో తప్పు లేదని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ బుధవారం మాట్లాడుతూ.. దెబ్బలు తిన్న ప్రతి విద్యార్థికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరిపిన వారికి శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నారు. తాము పార్లమెంట్ భవనంలో ఉన్నప్పుడు, అమిత్ షా పోలీసు అధికారులకు ఫోన్ చేయడం తాను స్వయంగా చూశానన్నారు. ప్రజలపై పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరపాలని అమిత్ షా ఆదేశాలు ఇచ్చి ఉండాలన్నారు. లేదా అక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోయి ఉండాలని పేర్కొన్నారు. ఒకవేళ తెలియకపోతే, ఆయన అసమర్థుడని, ఆయనే ఆదేశించి ఉంటే… పదవిలో కొనసాగడానికి అనర్హుడన్నారు.
Rahul Gandhi | అమానుష దాడి
విద్యార్థులు ప్రశ్నలు అడిగినప్పుడు, ఢిల్లీ వీధుల్లో వారిపై అమానుషమైన దాడులు జరిగాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. వారిని భయపెట్టడానికి బజరంగ్ దళ్‌ను వారిపైకి ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. సభలో సైతం తాను మాట్లాడే సమయంలో గొడవ చేశారన్నారు. ఆ అమానుష చర్యలకు అమిత్ షా బాధ్యుడని అనడాన్ని సాకుగా చూపారని విమర్శించారు. తాను క్షమాపణ చెబితే మాట్లాడే అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు లేదా వారితో సంబంధం ఉన్న ఏ వ్యక్తికైనా ఎప్పటికీ క్షమాపణ చెప్పనన్నారు.
#WATCH | Delhi | Lok Sabha LoP Rahul Gandhi says, “We will ensure that every student who was beaten… gets justice… and the people who shot our people with pellet guns will be punished… We have collected all the videos and photographs, and know the police officers who have… pic.twitter.com/mDrra4ajOu
— ANI (@ANI) July 29, 2026
దీనిని కూడా చదవండి : SPDCL Compensation | విద్యుత్ షాక్‌తో మరణిస్తే రూ.8 లక్షల పరిహారం.. ఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం