అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad new flyovers | హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ Traffic పద్మవ్యూహానికి పరిష్కారం చూపేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
అత్యంత రద్దీ ప్రాంతాలైన నాగార్జున సర్కిల్, టీవీ9 TV9 జంక్షన్లలో రూ. 368 కోట్ల అంచనా వ్యయంతో నూతన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి అధికారికంగా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీఓ 736ను జారీ చేసింది.
H-City ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టే ఈ నిర్మాణాలకు EPC (Engineering, Procurement, and Construction) విధానంలో టెండర్లు పిలిచి, పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
Hyderabad new flyovers | రూ. 368 కోట్ల ప్రాజెక్టు వివరాలు:
ఎన్ఎఫ్సీఎల్ (NFCL) జంక్షన్: బంజారాహిల్స్ రోడ్ నం. 3 నుంచి జీవీకే మాల్ GVK MALL వైపు వెళ్లే వాహనదారుల సౌకర్యార్థం రూ. 147 కోట్ల వ్యయంతో రెండు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు.
రూ. 221 కోట్ల వ్యయంతో ముగ్ధ జంక్షన్ నుంచి ఎన్ఎఫ్సీఎల్ వరకు మూడు లేన్ల అత్యాధునిక స్ట్రక్చరల్ స్టీల్ ఫ్లైఓవర్, అలాగే ఎన్ఎఫ్సీఎల్ నుంచి శ్రీనగర్ కాలనీ వరకు రెండు లేన్ల అండర్‌పాస్ రానుంది.
భూసేకరణ & యుటిలిటీ షిఫ్టింగ్: భూసేకరణ, విద్యుత్, నీటి పైప్‌లైన్ల మార్పిడి పనులను నిర్మాణంతో పాటు సమాంతరంగా చేపట్టి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని జీఓలో పేర్కొన్నారు.
విప్రో జంక్షన్ ప్రాజెక్టుకు తాత్కాలిక బ్రేక్: గతంలో రూ. 210 కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 368 కోట్లకు పెరగడంతో (రూ. 158 కోట్ల అదనపు భారం), విప్రో Wipro జంక్షన్ గ్రేడ్ సెపరేటర్ నిర్మాణాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు.
Hyderabad new flyovers | గండిమైసమ్మ, ప్రగతినగర్, అడ్డాగుట్ట ప్రాంతాలపై చిన్నచూపేల?
ఒకవైపు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలకు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. ఐటీ ఉద్యోగుల నివాసాలు, పరిశ్రమల కారిడార్లకు నిలయమైన కూకట్‌పల్లి, మేడ్చల్ నియోజకవర్గాల్లోని రద్దీ ప్రాంతాలను విస్మరిస్తుండటంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కూకట్‌పల్లి పరిధిలోని ప్రగతినగర్, అడ్డాగుట్టలతో పాటు నిత్యం వేలాది వాహనాలతో కిక్కిరిసిపోయే గండిమైసమ్మ జంక్షన్ వద్ద ప్రతిరోజు ఘోరమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి.
Hyderabad new flyovers | గండిమైసమ్మ జంక్షన్ అంటేనే హడల్..
మహా నగర శివారులోని గండిమైసమ్మ జంక్షన్లో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. జంట నగరాల నుంచి మెదక్ జిల్లాకు ఈ జంక్షన్ నుంచే అనుసంధానం ఉంది. దీనికితోడు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పరిశ్రమలు, ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం – సాయంత్రం వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులకు, వాహనదారులకు నరకం కనిపిస్తోంది.
Hyderabad new flyovers | ప్రభుత్వ కర్తవ్యం గుర్తించాలి..
ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, పారిశ్రామిక రవాణా వాహనాలు భారీ సంఖ్యలో ప్రయాణించే ఈ మార్గాల్లో జంక్షన్ల విస్తరణ, ఫ్లైఓవర్లు లేకపోవడంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి.
మహా నగరంలోని నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితం కాకుండా.. ప్రగతినగర్, అడ్డాగుట్ట, గండిమైసమ్మ జంక్షన్లలో కూడా తక్షణమే ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమగ్ర నగర రవాణా అభివృద్ధికి అన్ని ప్రాంతాలపైనా సమాన దృష్టి సారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.