Nizamabad Rain Control Room | వర్షాల నేపథ్యంలో అధికారుల కీలక నిర్ణయం.. కలెక్టరేట్​లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్​ కీలక నిర్ణయం తీసుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Rain Control Room | జిల్లా (Nizamabad)లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. కలెక్టరేట్​లో అత్యవసర పరిస్థితుల్లో స్పందించేవిధంగా కంట్రోల్​ రూంను ఏర్పాటుచేశారు.

Nizamabad Rain Control Room | కంట్రోల్​ రూం ద్వారా సమీక్ష..

ఈ సందర్భంగా వర్షాలపై పూర్తి సమాచారాన్ని కంట్రోల్​ రూం ద్వారా సమీక్షిస్తామని అదనపు కలెక్టర్​ భుజంగరావు పేర్కొన్నారు. భారీ వర్ష సూచనల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి తలెత్తినా సమర్ధవంతంగా ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉండాలని క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని అదనపు కలెక్టర్ ఆదేశించారు. వర్షాల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచారం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని కంట్రోల్ రూమ్ సిబ్బందికి సూచించారు.

Nizamabad Rain Control Room | అదుపులోనే జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపారు. జిల్లా యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని అన్నారు. వర్షాల వల్ల జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే, కలెక్టరేట్​లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08462 – 220183 కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

ఇది కూడా చదవండి..: Family Register Certificate | దొంగ ఓట్ల నమోదు కోసమే ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *