అక్షరటుడే, వెబ్‌డెస్క్: Meta India Case | ఇటీవల జంతర్ మంతర్ వద్ద జరిగిన బొద్దింక జనతా పార్టీ నిరసనల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకున్న కంటెంట్‌పై మెటా ఇండియా హెడ్‌తో పాటు ఇతర ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై కేసులు నమోదయ్యాయి.
ఈ విషయంలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ప్రధానమంత్రి (PM Narendra Modi)కి సంబంధించిన మార్ఫింగ్ చేసిన, అభ్యంతరకరమైన వీడియోలు, చిత్రాలను ప్రచారం చేశారన్న ఆరోపణలపై మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు పలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
Meta India Case | ప్రధానిని అవమానించడంతో..
ప్రధానమంత్రిని అశ్లీలంగా, అవమానకరంగా, తప్పుదోవ పట్టించే విధంగా చిత్రీకరిస్తూ మార్ఫింగ్, డిజిటల్‌గా మార్పులు చేసిన అనేక వీడియోలు, చిత్రాలు తమకు కనిపించాయని ఇద్దరు వ్యక్తులు చేసిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదయ్యాయి. తాను ఇన్‌స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తుండగా.. ప్రధానమంత్రిని అశ్లీలంగా, అవమానకరంగా చిత్రీకరిస్తూ మార్ఫింగ్, డిజిటల్‌గా మార్పులు చేసిన అనేక వీడియోలు, చిత్రాలు తనకు కనిపించాయని ఓ ఫిర్యాదు దారుడు పేర్కొన్నాడు.
అలాగే మరో వ్యక్తికి సైతం ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీకి సంబంధించి అభ్యంతరకరమైన రీల్స్, మార్ఫింగ్ చేసిన చిత్రాలను చూసినట్లు ఆరోపించాడు. ‘భారత సార్వభౌమత్వానికి, సమగ్రతకు, ప్రజా భద్రతకు హానికరమైన’ కంటెంట్‌ను ప్రచురిస్తున్న ఖాతాలపై విచారణ జరపాలని సదరు వ్యక్తి డిమాండ్ చేశాడు. కాగా.. ఇప్పటివరకు పోలీసులు జరిపిన విచారణ ప్రకారం, ఈ వీడియోలలో చాలా వరకు తొలగించబడ్డాయి లేదా భారతదేశంలో అందుబాటులో లేవు.
ఇది కూడా చదవండి..: Anti Paper Leak Bill | యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం..పరీక్షల్లో అక్రమాలకు ఇక కఠిన శిక్షలు