Pakistan Mine Blast | పాకిస్తాన్‌లో పేలుడు.. 32 మంది దుర్మరణం..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pakistan Mine Blast | పాకిస్తాన్‌ (Pakistan)లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో గురువారం ఒక బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ శక్తివంతమైన పేలుడులో కనీసం 32 మంది గని కార్మికులు మరణించారు. మరో 10 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.

అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. సహాయక బృందాలు గని లోపల రెస్క్యూ ఆపరేషన్​ చేపడుతున్నాయి. ప్రాణాలతో ఉన్నవారిని కనుగొనే అవకాశాలు వేగంగా తగ్గిపోతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.

Pakistan Mine Blast | క్వెట్టా శివారులోని గనిలో పేలుడు

బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన క్వెట్టా శివారులో గల గనిలో పేలుడు సంభవించింది. ప్రభుత్వ గని ఇన్‌స్పెక్టర్ ఘనీ బలూచ్ తెలిపిన వివరాల ప్రకారం.. గని లోపల మిథేన్ వాయువు పేరుకుపోవడం వల్లే ఈ పేలుడు సంభవించిందని అనుమానిస్తున్నారు.

Pakistan Mine Blast | కొనసాగుతున్న సహాయక చర్యలు

పేలుడు సంభవించిన అనంతరం అత్యవసర బృందాలు సంఘటనా స్థలం నుంచి ఏడు మృతదేహాలను వెలికితీశాయి. సహాయక చర్యలు చేపట్టగా మరో 25 మృతదేహాలను గుర్తించారు. దీంతో మృతుల సంఖ్య 32కు చేరింది. మరో 10 మంది కార్మికులు భూగర్భంలోనే చిక్కుకుపోయారని, వారిని చేరుకునేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు.

Pakistan Mine Blast | పేలుడుపై విచారణకు ఆదేశం

పేలుడుకు గల కారణాన్ని నిర్ధారించడానికి అధికారులు సమగ్ర విచారణ జరపున్నట్లు అక్కడి మంత్రి తెలిపారు. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా నిరోధించడానికి, లోపాలను గుర్తించి భద్రతా చర్యలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న మైనింగ్ భద్రతా నిబంధనలను సమీక్షిస్తుందని చెప్పారు.

ఇది కూడా చదవండి..: US Airstrikes Iran | ఇరాన్‌పై అమెరికా భారీ దాడులు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *