అక్షరటుడే, వెబ్‌డెస్క్: Parliament Protest Skit | దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) విరాళాల చోరీ ఉదంతంపై విపక్షాలు ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి. ఇందులో భాగంగానే స్వతంత్ర ఎంపీ రాజేశ్ రంజన్ (పప్పు యాదవ్) పార్లమెంట్ ఆవరణలో ఓ వినూత్న స్కిట్ ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించారు.
Parliament Protest Skit | సన్యాసి వేషధారణలో పప్పు యాదవ్..
కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసి వేషంలో వచ్చిన పప్పు యాదవ్, పార్లమెంట్ పరిసరాల్లో కూర్చొని విరాళాలు సేకరించారు. ఈ నాటకంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు రుచి వీరా, అవధేశ్ ప్రసాద్ కూడా నటించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ స్కిట్‌లో అతిథి పాత్రలో కనిపించి హుండీలో కొంత మొత్తం వేశారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ కూడా తమ వంతు విరాళాలు అందించారు. ఆ తర్వాత ఎంపీలు ఇచ్చిన విరాళాలతో ఆ సన్యాసి ఉడాయించగా, దానిని గమనించిన ఎంపీలు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసినట్లు నటించడంతో ఈ స్కిట్ ముగిసింది.
Parliament Protest Skit | ప్రభుత్వ తీరుపై ఆగ్రహం..
ఈ స్కిట్‌పై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ స్పందిస్తూ.. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ జరిగిందని మండిపడ్డారు. దీనిపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రారంభమైన రోజు నుంచే నోటీసులు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, అందుకే ఈ వినూత్న నిరసన చేపట్టినట్లు తెలిపారు.
Parliament Protest Skit | స్పీకర్ ఓం బిర్లా అసహనం..
లోక్‌సభలో పప్పు యాదవ్ కాషాయ వస్త్రధారణ అందరినీ ఆకర్షించినప్పటికీ, దీనిపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. సభకు ఇలా విభిన్న వేషధారణలతో రావడం సరికాదని ఆయన సభ్యులను మందలించారు.
संसद में विपक्ष ने किया चंदा चोरी का नाट्य रूपांतरण, श्रद्धालु बने राहुल गांधी जी ने दान दिया, पुजारी बने पप्पू यादव दानपात्र लेकर ‘चंपत’ हो गए। pic.twitter.com/dZJYcZpDsx
— Pawan Khera 🇮🇳 ಪವನ್ ಖೇರಾ (@Pawankhera) July 31, 2026
ఇది కూడా చదవండి..: Omar Abdullah Divorce | ఒమర్ అబ్దుల్లా, పాయల్ అబ్దుల్లా దంపతులకు విడాకులు మంజూరు