అక్షరటుడే వెబ్‌డెస్క్: Cauvery Dispute | కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జల వివాదం మరింత ముదురుతోంది. రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం చర్చల వాతావరణం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ( DK Shivakumar )స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం విజయ్‌తో జరగాల్సిన చర్చలను రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు. విజయ్ తన కర్ణాటక పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించారు. కావేరి నీటి విడుదలపై విపక్షాలు , న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అలాగే, కర్ణాటక బంద్ కు ఇచ్చిన పిలుపును విపక్షాలు ఉపసంహరించుకోవాలని సీఎం కోరారు.
Cauvery Dispute | రాష్ట్రంలో ఆందోళనల దృష్ట్యా..
ప్రస్తుతం కర్ణాటకలో పరిస్థితులు అనుకూలంగా లేవని డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడుతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలనే ఉద్దేశ్యంతోనే సీఎం విజయ్‌ను తన పర్యటనను కొంతకాలం వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే, కావేరి జలవివాదం నేపథ్యంలో కర్ణాటకలో, ముఖ్యంగా మాండ్యా ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులు ఇటీవల విడుదలైన తమిళనాడు సీఎం విజయ్ సినిమా ‘జననాయగన్’ పోస్టర్లను చించివేయడంతో పాటు కొన్ని థియేటర్లలో ప్రదర్శనలను అడ్డుకున్నారు.
Cauvery Dispute | అసలు వివాదం ఏమిటంటే..
కావేరి నది జలాల పంపిణీకి సంబంధించి కర్ణాటక, తమిళనాడు మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. నది జలాలపై తమకే ఎక్కువ హక్కు ఉందని ఇరు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం తమిళనాడు సీఎం విజయ్ బెంగళూరుకు వచ్చి చర్చలు జరపాలని నిర్ణయించుకోవడంతో కర్ణాటకలో నిరసనలు ఉధృతమయ్యాయి.
ఇది కూడా చదవండి: Oora Panduga Festival | ఆషాఢమాసంలో ప్రత్యేకం ‘ఊర పండుగ’