అక్షరటుడే, వెబ్డెస్క్: Government Exams Amendment 2026 | దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, మాస్ కాపీయింగ్, ఇతర అక్రమ పద్ధతులకు శాశ్వతంగా ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ప్రభుత్వ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు, 2026’ (The Public Examinations (Prevention of Unfair Means) Amendment Act, 2026) చట్ట రూపం దాల్చింది.
Anil Ambani CBI Case | EPFO పెట్టుబడుల వ్యవహారం..అనిల్ అంబానీపై CBI కేసు నమోదు
ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లుకు 2026 జులై 31న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ, న్యాయశాఖ (ల్యాజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్) అధికారికంగా భారత రాజపత్రం (The Gazette of India) విడుదల చేసింది (గెజిట్ నంబర్ 10, 2026).
Government Exams Amendment 2026 | సవరణ చట్టంలో కీలక అంశాలు
లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే ముఠాలు, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఈ సవరణ చట్టంలో అత్యంత కఠినమైన నిబంధనలను పొందుపరిచారు.
శిక్షా కాలం పెంపు: 2024 నాటి మూల చట్టం (Principal Act) ప్రకారం ఉన్న 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష కాలాన్ని భారీగా పెంచారు. నూతన సవరణ ప్రకారం అక్రమాలకు పాల్పడే వారికి కనీసం 5 సంవత్సరాల నుంచి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించనున్నారు.
భారీ జరిమానా: జరిమానా మొత్తాన్ని గతంలో ఉన్న రూ. 10 లక్షల నుంచి ఏకంగా రూ. 50 లక్షల వరకు పెంచారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు: పరీక్షల అక్రమాలకు సంబంధించిన కేసులను వేగవంతంగా విచారించి, బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.
Government Exams Amendment 2026 | లక్షలాది మంది అభ్యర్థులకు ఊరట
ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీల కారణంగా రద్దవుతున్న పరీక్షలు, తీవ్ర మనోవేదనకు గురవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేసింది.
2024 నాటి చట్టంలోని సెక్షన్ 10కి ఈ కొత్త సవరణలు చేశారు. కఠిన జైలు శిక్షలు, భారీ జరిమానాలతో పాటు వేగవంతమైన విచారణ వ్యవస్థ అమల్లోకి రానుండటంతో ఇకపై పోటీ పరీక్షల్లో పారదర్శకత పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.