OnePlus Nord N6X | మార్కెట్‌లోకి వన్ ప్లస్ ఎన్ 6ఎక్స్ .. ఆగస్టు 4 నుంచి సేల్ ప్రారంభం

వన్ ప్లస్ తమ సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎన్ 6ఎక్స్ పేరుతో తీసుకువచ్చిన ఈ ఫోన్ సేల్ మంగళవారం ప్రారంభంకానుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: OnePlus Nord N6X | చైనాకు చెందిన ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ తయారీ కంపెనీ అయిన వన్ ప్లస్ .. భారత మార్కెట్‌లో మరో మోడల్ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. ఎన్ 6ఎక్స్ పేరుతో విడుదలైన ఈ ఫోన్ లో శక్తిమంతమైన ప్రాసెసర్ , 7000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. కంపెనీ వెబ్‌సైట్ తో పాటు అమెజాన్‌ (Amazon)లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ సేల్ మంగళవారం (ఆగస్టు 4న) ప్రారంభం కానుంది. కొత్త మోడల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..

డిస్‌ప్లే : 6.8 ఇంచ్ హెచ్డీ ప్లస్ ఎల్ సీడీ డిస్‌ప్లే అమర్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 720 x 1570 పిక్సల్స్ రిజల్యూషన్, ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ కలిగి ఉంది.

OnePlus Nord N6X | ప్రాసెసర్..

మీడియాటెక్ డైమెన్సిటీ 6360 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.

OnePlus Nord N6X | కెమెరా సెటప్..

వెనకవైపు 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ టెలిఫొటో లెన్స్‌తో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ : 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15డబ్ల్యూ చార్జింగ్, 5డబ్ల్యూ రివర్స్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే 20.56 గంటలపాటు వీడియోలు చూడొచ్చని, 133.56 గంటలపాటు మ్యూజిక్ ప్లే, 25.04 గంటలపాటు సోషల్ మీడియా స్క్రోల్, 11.26 గంటలపాటు వీడియో రికార్డింగ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది.

వేరియంట్స్ : బర్గండీ రెడ్, ఐస్ బ్లూ కలర్స్‌లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999.
4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999.
ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు తక్షణ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Stock Market Timings | స్టాక్ మార్కెట్ టైమింగ్స్‌లో మార్పు.. నేటినుంచి అమలులోకి..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *