అక్షరటుడే, వెబ్‌డెస్క్: RBI MPC Meeting | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశాలు సోమవారం (ఆగస్టు 3న) ప్రారంభమయ్యాయి. మÖడు రోజులపాటు సమావేశం కొనసాగనుంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆగస్టు 5న ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటిస్తారు. ఈ సమావేశంలో అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈసారైనా కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తారా? యథాతథ స్థితిని కొనసాగిస్తారా అన్న అంశంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
RBI MPC Meeting | ఊరట లేనట్లేనా!?
జియో పొలిటికల్ టెన్షన్స్‌తో క్రూడ్ ఆయిల్ ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. రూపాయి విలువపై ఒత్తిడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోల రాబోయే రెండు త్రైమాసికాల పాటు రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం కంటే ఎక్కువగా ఉంటుందనే అంచనాలున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరగకుండా చూసేందుకే ఆర్బీఐ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నందున ఈసారి కూడా రెపో రేటులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చన్న అభిప్రాయం అనలిస్టుల్లో వ్యక్తమవుతోంది. దీంతో గృహ, వాహన రుణాల ఈఎంఐలు తగ్గే అవకాశాలు లేవు.
ఇది కూడా చదవండి..: Prashant Kishor Lead | బీహార్ ఉప ఎన్నిక.. ఆధిక్యంలో ప్రశాంత్ కిశోర్