Mega Job Mela | ఎమ్మెల్యే ధన్​పాల్​ ఆధ్వర్యంలో మెగా జాబ్​మేళా

నగరంలో ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో మెగా జాబ్​ మేళా నిర్వహించనున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు : Mega Job Mela | నగరంలో(Nizamabad) ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) ఆధ్వర్యంలో మెగా జాబ్​ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.

Mega Job Mela | శ్రీరామ గార్డెన్స్​లో..

అర్బన్​లోని యువతీయువకుల కోసం ఈనెల 9వ తేదీన ఆర్మూర్​ రోడ్​లోని శ్రీరామ గార్డెన్స్​లో జాబ్​మేళా నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ, ఇంటర్​, ఐటీఐ, పారామెడికల్​ డిప్లొమా, డిగ్రీ, హోటల్​ మేనేజ్​మెంట్​ ఎంబీఏ, బీటెక్​, ఫార్మసీ, పీజీ కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన యువతీయువకులు ఈ మెగా జాబ్​ మేళాలో పాల్గొనవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.

రెండువేలకు పైగా ఉద్యోగాలు..

ఈ మెగా జాబ్​మేళాకు సుమారు 60కి పైగా ​ కంపెనీలు రానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆయా కంపెనీల్లో సుమారు 2వేలకు పైగా ఉద్యోగవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఆసక్తిగల యవత 62811 59790, 93921 87672లలో సంప్రదించాలని సూచించారు. అప్లికేషన్ల రిజిస్ట్రేషన్ల కోసం క్యూఆర్​కోడ్​ స్కాన్​ చేసి రిజిస్ట్రేషన్​ చేసుకోవాలని పేర్కొన్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *