Balkonda Hospital Works | బాల్కొండ ఆస్పత్రి పనులను త్వరగా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

బాల్కొండ నియోజకవర్గంలో ఆస్పత్రుల పనులను వేగంగా పూర్తి చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహను ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి కోరారు.

shashi kiran Mottala

​అక్షరటుడే, భీమ్‌గల్ : Balkonda Hospital Works | బాల్కొండ (Balkonda) నియోజకవర్గంలో ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Balkonda MLA Prashanth Reddy) కోరారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన నిర్వహించిన నిజామాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ సమీక్షలో ఆయన మాట్లాడారు.

Balkonda Hospital Works | నియోజకవర్గంలో పీహెచ్​సీ భవనాలు..

నియోజకవర్గంలో నూతన పీహెచ్​సీ భవనాలు, మౌలిక సదుపాయాలు, నిధుల మంజూరుకు సంబంధించి 10 కీలక ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేసి వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భీమ్​గల్​ పట్టణంలో నిర్మాణం తుదిదశలో ఉన్న 100 పడకల ఏరియా ఆస్పత్రి పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న హాస్పిటల్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు.

ప్రస్తుతం భీమ్​గల్​లో పనిచేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) రహత్ నగర్ గ్రామానికి తరలించేందుకు అనుమతించి, అక్కడ నూతన భవన నిర్మాణానికి పరిపాలనా అనుమతి ఇవ్వాలన్నారు. భీమ్​గల్​ పట్టణ ప్రజల అవసరాల దృష్ట్యా కొత్తగా అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC), మోర్తాడ్ మండలంలోని పాలెం లేదా తిమ్మాపూర్ గ్రామంలో నూతన PHC ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. బాల్కొండ మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కు కొత్త భవనం, బాల్కొండ, మోర్తాడ్ మండలాల్లో నూతన పోస్టుమార్టం భవనాల నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

​Balkonda Hospital Works | పోస్టుల భర్తీ.. ఎన్​హెచ్​ఎం నిధుల విడుదల..

బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని 24గంటలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది నియామకానికి (Cadre Strength) ఆమోదం తెలిపి ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని వేముల కోరారు. నియోజకవర్గంలోని 9 ఉపకేంద్రాల భవనాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే 18 ఆరోగ్య ఉపకేంద్రాలు / ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల (AAM) నిర్మాణానికి పరిపాలనా అనుమతి ఇచ్చి నిధులు కేటాయించాలని విన్నవించారు. వీటితో పాటు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH)లో రోగుల అత్యవసర అవసరాల కోసం కొత్తగా ఎంఆర్ఐ (MRI) మెషిన్ మంజూరు చేయాలన్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *