Govind Mohan | కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ పదవీకాలం పొడిగింపు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి గోవింద్ మోహన్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Govind Mohan | కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి గోవింద్ మోహన్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ACC) ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపినట్లు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్’ (DoPT) బుధవారం అధికారిక ప్రకటన వెలువరించింది.

Govind Mohan | పదవీకాలం పెంపు వివరాలు..

ఈ ఉత్తర్వుల ప్రకారం, 2026 ఆగస్టు 22తో ముగియాల్సిన ఆయన పదవీకాలం.. 2027 ఆగస్టు 22 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పొడిగించారు. ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనలకు తగిన మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగ కార్యదర్శి మనీషా సక్సేనా ఈ ఉత్తర్వులపై సంతకం చేసి అధికారికంగా విడుదల చేశారు.

ఇది కూడా చదవండి:  Tamil Nadu Budget | విజయ్ సర్కార్ తొలి బడ్జెట్.. రూ. 4.11 లక్షల కోట్లతో భారీ కేటాయింపులు..ఏ రంగానికి ఎంతంటే..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *