Aug 06 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు..గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aug 06 Market Analysis | పశ్చిమాసియా(West Asia)లో కొనసాగుతున్న ఇరాన్ -ఒమన్ చర్చలు అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు రేకెత్తిస్తున్నా.. ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న అనుమానాలతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

దీంతో క్రూడ్ ఆయిల్ ధర దిగివస్తున్నా గ్లోబల్ మార్కెట్లు (Global markets) మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నాయి. గత సెషన్‌లో యూఎస్, యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగియగా.. గురువారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగా సాగుతున్నాయి.

Aug 06 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.83 శాతం, ఎస్ అండ్ పీ 0.17 శాతం నష్టపోగా.. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.17 శాతం లాభంతో ఉంది.

Aug 06 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.08 శాతం, ఫ్రాన్స్‌ France కు చెందిన సీఏసీ 0.03 శాతం లాభంతో ఉండగా.. జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.29 శాతం నష్టపోయింది.

Aug 06 Horoscope | ఆఫీసులో ఊహించని రివార్డులు..సృజనాత్మకతకు ప్రశంసలు దక్కేది ఈ రాశుల వారికే!

Aug 06 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.87 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.41 శాతం లాభంతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 4.30 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.70 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.37 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.85 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.27 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఆరో సెషన్ల తర్వాత నికర అమ్మకందారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 943 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.

  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 2,883 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 27 పైసలు బలపడి 95.12 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.66 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.61 వద్ద ఉన్నాయి.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 79.79 డాలర్ల వద్ద ఉంది.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *