Stock Market Today | రిలయన్స్‌లో దూకుడు.. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 269 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Today | పశ్చిమాసియాలో శాంతి కోసం దౌత్యపరమైన పురోగతిపై ఆశలు చిగురిస్తుండడంతో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 80 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. దీనికితోడు కంపెనీల మొదటి త్రైమాసిక ఫలితాలు బాగుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగుతోంది. రిలయన్స్‌తోపాటు బ్యాంకింగ్ స్టాక్స్ ప్రధాన సూచీలను ముందుకు తీసుకువెళ్తున్నాయి.

Stock Market Today | లాభాలతో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 201 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 101 పాయింట్లు పెరిగింది. అక్కడ కొంత కరెక్షన్‌కు గురై 208 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 24 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 61 పాయింట్లు పడిపోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 269 పాయింట్ల లాభంతో 78,850 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 24,659 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 12 స్టాక్స్ లాభాలతో, 18 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్ 2.73 శాతం, బీఈఎల్ 2.21 శాతం, ఎటర్నల్ 2.19 శాతం, టైటాన్ 1.51 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.90 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : పవర్‌గ్రిడ్ 3.63 శాతం, ట్రెంట్ 1.28 శాతం, ఎం అండ్ ఎం 1.08 శాతం, ఎన్టీపీసీ 1.01 శాతం, టీసీఎస్ 0.72 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Flipkart Freedom Sale | ఫ్రీడమ్ సేల్ కు ఫ్లిప్‌కార్ట్ రెడీ.. వారికి నేటి అర్ధరాత్రినుంచే అందుబాటులోకి..

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *