అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ashadam Friday | ఆషాఢ చివరి శుక్రవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Ashadam Friday | సుమంగళి పూజలు..
జిల్లా (Nizamabad)లోని పలు ఆలయాల్లో సుమంగళి పూజలు, విశేష కుంకుమార్చనలు పెద్ద ఎత్తున జరిగాయి. నగరంలోని పెద్ద పోచమ్మ ఆలయం, దేవి మందిర్, కొత్త కలెక్టరేట్ సమీపంలోని బంగారు మైసమ్మ ఆలయాల్లో అమ్మవార్లను లక్ష్మీదేవి, గాయత్రి దేవి రూపాల్లో అలంకరించారు. మరికొన్ని చోట్ల అమ్మవారిని కూరగాయలు, పండ్లతో శాకాంబరీ దేవిగా అలంకరించి పూజించారు.
బోనాల సందడి..
ఆషాఢంలో చివరి శుక్రవారం కావడంతో బోనాలు సందడి కనిపించింది. అమ్మవారి దేవాలయాలకు మహిళలు ఘటాలు, బోనాలతో వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఆయా పాఠశాలల్లో శుక్రవారం ప్రత్యేకంగా బోనాల పండుగను నిర్వహించారు. ఉపాధ్యాయినులు, విద్యార్థినులు కొత్త దుస్తుల్లో హాజరై బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Pocharam Bus | విద్యార్థుల సమస్యకు పోచారం తక్షణ పరిష్కారం.. బస్సు సర్వీస్ ఏర్పాటు