Wife Texted Lover | ఎలాగైనా నా భర్తను చంపు.. ప్రియుడికి మెసేజ్​ చేసిన భార్య

తన భర్తను చంపాలని ఓ మహిళ ప్రియుడికి మెసేజ్​ చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Wife Texted Lover | సమాజంలో రోజురోజుకు నేర ప్రవృత్తి పెరిగి పోతుంది. ముఖ్యంగా వివాహేతర సంబంధాల కోసం కట్టుకున్న వారిని కడతేరుస్తున్నారు. ప్రియుడితో కలిసి భార్యలు, భర్తలను చంపుతుండగా.. ప్రియురాలి మోజులో కట్టుకున్న భార్యను కొందరు చంపేస్తున్నారు. తాజాగా ఓ మహిళ తన భర్తను ఎలాగైనా చంపాలని ప్రియుడికి మెసేజ్​ పంపింది. లేదంటే తాను చనిపోతానని పేర్కొంది. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లాలో చోటు చేసుకుంది.

Wife Texted Lover | ఫోన్​ చెక్​ చేయడంతో..

మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District) డోర్నకల్లు మండలం చిలుకోడుకు చెందిన రాజేశ్వరరావుకు 2016లో సూర్యాపేట జిల్లాకు చెందిన భవానితో వివాహం అయింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సైదులు అనే కొరియర్ బాయ్‌తో భవాని వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో గత నెల 27న పెద్దల సమక్షంలో రాజేశ్వరరావు పంచాయితీ పెట్టాడు. అనంతరం తన అన్నను తీసుకురావడానికి రాజేశ్వరరావు వెళ్తుండగా.. అతని సైదులు వెంబడించాడు. అతడి నుంచి తప్పించుకొని ఆయన ఇంటికి వచ్చి భార్య ఫోన్​ చెక్​ చేశారు. తన భర్తను చంపాలని వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియుడికి తన భార్య పంపిన మెసేజ్‌ చూసి రాజేశ్వరరావు షాక్​ అయ్యాడు.

Wife Texted Lover | పోలీసులకు ఫిర్యాదు

తన భర్తను ఎలాగైనా చంపాలని, లేదంటే తాను చనిపోతానని సైదులకు భవాని మెసేజ్​ పంపింది. ఆ చాటింగ్ స్క్రీన్‌షాట్లు తీసుకొని.. భార్య భవాని, ఆమె ప్రియుడిపై రాజేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. మరోసారి ఠాణాను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Srisailam Power Generation | శ్రీశైలంలో విద్యుత్​ ఉత్పత్తి ప్రారంభం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *