Abhijit Dipke | మోహన్​ భగవత్​ వ్యాఖ్యలపై స్పందించిన అభిజిత్​ దీప్కే

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Abhijit Dipke | జెన్-జెడ్ గురించి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) చేసిన వ్యాఖ్యలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందించారు. ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మాట్లాడుతూ.. ఆందోళన చేసినంత మాత్రాన జెన్​ జీ యువతను యాంటీ నేషనల్స్​ అనడం సరికాదన్నారు.

‘జెన్-జెడ్’ తరాన్ని దేశ వ్యతిరేకులుగా ముద్ర వేయకూడదని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ చెప్పారని అభిజిత్​ అన్నారు. ఆయన బీజేపీకి మార్గదర్శిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి, ఇదే విషయాన్ని బీజేపీకి, నరేంద్ర మోదీకి కూడా తెలియజేయాలని కోరారు. వారు మోహన్ భగవత్ మాటలను వింటారని, వాటిని పాటిస్తారని ఆయన ఆశించారు. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ను ధిక్కరించే అవకాశం తక్కువ అన్నారు. అత్యధిక సంఖ్యలో నకిలీ వీడియోలు ఐటీ సెల్ (IT cell) నుంచే వస్తున్నాయన్నారు. ఏ వీడియోలు నిజమైనవి, ఏవి నకిలీవో తేల్చడానికి విచారణ జరగాలన్న మోహన్ భగవత్ అభిప్రాయాన్ని అందరూ అంగీకరించాలని దీప్కే కోరారు.

Abhijit Dipke | విద్యార్థులకు మద్దతు ఇస్తున్నాం

Abhijit Dipke

జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు మాట్లాడుతూ.. తాము వారికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తమ ప్రతినిధి బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించిందన్నారు. వారికి అండగా నిలబడి, వారి డిమాండ్లన్నింటికీ మద్దతు ఇస్తున్నట్లు దీప్కే ప్రకటించారు. తాను అక్కడికి వెళ్లాలి అనుకుంటున్నానని, అయితే ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుండటంతో వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. జార్ఖండ్​లో నిరసన తెలపడానికి విద్యార్థులు ముందుకు వస్తున్నారని చెప్ఆరు. వారు స్వయంగా నాయకులుగా ఎదిగారని, వారికి తగిన గుర్తింపు లభించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతిచోటా అభిజిత్ ముందంజలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. క్రెడిట్ అంతా కేవలం CJPకే దక్కాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Gujarat Well Waves | బావిలో అలలు.. గుజరాత్​లో వింత

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *