అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sensex Nifty Loss | హోర్ముజ్ జలసంధిపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ముడిచమురు ధరలు తిరిగి ఎగబాకుతున్నాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా నష్టాలలోనే కదలాడింది. ఆటో, టెక్నాలజీ రంగాల షేర్లు రాణించినా.. ఫైనాన్షియల్ స్టాక్స్‌లోని బలహీనత కారణంగా బెంచ్‌మార్క్ సూచీలు ఒత్తిడికి గురయ్యాయి.
Sensex Nifty Loss | నష్టాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 428 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 241 పాయింట్లు పెరిగింది. తిరిగి లాభాల స్వీకరణతో ఇంట్రాడే గరిష్టాలనుంచి 380 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా కోలుకుని 92 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 108 పాయింట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 455 పాయింట్ల నష్టంతో 78,499 వద్ద, నిఫ్టీ 65 పాయింట్ల నష్టంతో 24,570 వద్ద స్థిరపడ్డాయి.
Sensex Nifty Loss | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,044 కంపెనీలు లాభపడగా 2,209 స్టాక్స్ నష్టపోయాయి. 207 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 171 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 80 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainer : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 14 స్టాక్ లాభపడగా.. 16 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టీసీఎస్ 3.53 శాతం, ఎం అండ్ ఎం 2.53 శాతం, ఎస్బీఐ 1.03 శాతం, టెక్ మహీంద్రా 0.91 శాతం, బీఈఎల్ 0.74 శాతం లాభపడ్డాయి.
Top Losers : బజాజ్ ఫైనాన్స్ 5.90 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 4.18 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3.72 శాతం, ట్రెంట్ 3.54 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.20 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Aug 07 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్లో భారీ లాభాల దిశగా గోల్డ్