Fake Paneer Ban | ఫేక్​ పనీర్​పై బ్యాన్​.. ఉత్తరాఖండ్ ప్రభుత్వ చర్యలు

పాలకు బదులుగా కూరగాయల నూనెలు, పిండి పదార్థాలతో తయారు చేసే పనీర్​ను ఉత్తరాఖండ్​ ప్రభుత్వం నిషేధించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fake Paneer Ban | నకిలీ పనీర్​పై ఉత్తరాఖండ్​ (Uttarakhand) ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వచ్ఛమైన పాలకు బదులుగా కూరగాయల నూనెలు, పిండి పదార్థాలు, రసాయనాలను ఉపయోగించి తయారు చేసిన పనీర్, నెయ్యి, వెన్నతో సహా నాసిరకం పాల, నకిలీ పాల ఉత్పత్తుల తయారీ, నిల్వ, రవాణా అమ్మకాలను నిషేధించింది.

ఆహార భద్రత, ప్రమాణాల చట్టం కింద విధించిన ఈ నిషేధం రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి వచ్చింది. అసలైన పాల ఉత్పత్తులు కానప్పటికీ, వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్న పనీర్, నెయ్యి, వెన్న లేదా ఇతర పాల ఉత్పత్తుల పేర్లతో విక్రయించే వాటికి ఈ నిషేధం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. సురక్షితమైన, స్వచ్ఛమైన ఆహారం లభ్యతను నిర్ధారించడానికి, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Fake Paneer Ban | రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు

ఆహార భద్రతా శాఖ డెయిరీ యూనిట్లు, గిడ్డంగులు, మార్కెట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులలో దాడులు ప్రారంభించింది. అనుమానిత ఉత్పత్తుల నమూనాలను ప్రయోగశాల పరీక్షల కోసం పంపుతామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కల్తీ పదార్థాలు విక్రయిస్తే ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు సదరు దుకాణాల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: PM Modi IIT Delhi | జీవితం చాలా పరీక్షలు పెడుతుంది : ప్రధాని మోదీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *