అక్షరటుడే, వెబ్‌డెస్క్: IAF Officer Honeytrap | భారత వైమానిక దళానికి చెందిన ఓ అధికారి హనీట్రాప్ అయ్యాడు. అంతేగాకుండా భారత రహస్యాలను పాక్ చేరవేశాడు. అతడిని ఢిల్లీ పోలీసులు (Delhi Police) అరెస్ట్ చేశారు.
భారత వైమానిక దళానికి చెందిన ఒక వింగ్ కమాండర్‌ను అరెస్టు చేశారు. అతనిపై అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. భారత సైన్యం, జాతీయ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక సమాచారాన్ని పొందడమే లక్ష్యంగా ఉన్న ఒక పెద్ద గూఢచర్య నెట్‌వర్క్‌లో అతను భాగమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
IAF Officer Honeytrap | మహిళతో చాటింగ్..
సదరు వింగ్ కమాండర్ తన వ్యక్తిగత జీవితంలో కష్టకాలం ఎదుర్కొంటున్నప్పుడు సోషల్ మీడియాలో ఒక మహిళతో చాటింగ్ చేయడం ప్రారంభించారు. అనంతరం వారి పరిచయం వీడియో కాల్స్ వరకు వెళ్లింది. అనంతరం ఆమె సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అడగడం ప్రారంభించింది. సైనిక యూనిట్ల కదలికలు, మోహరింపుల వివరాలతో పాటు ఇతర సున్నితమైన సమాచారాన్ని కూడా ఆ మహిళతో ఆయన పంచుకున్నారని సమాచారం. ఆ మహిళ ఒక పాకిస్తానీ గూఢచార సంస్థ కోసం పనిచేస్తోందని, ఆ అధికారి హనీ ట్రాప్‌కు గురయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు అధికారి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు.
ఇది కూడా చదవండి..: Fake Paneer Ban | ఫేక్ పనీర్‌పై బ్యాన్.. ఉత్తరాఖండ్ ప్రభుత్వ చర్యలు