Molbio Diagnostics IPO | డయాగ్నోస్టిక్స్ కంపెనీ ఐపీవో ప్రారంభం

మోల్బియో డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ సోమవారం ప్రారంభమైంది. బుధవారం వరకు అందుబాటులో ఉండనుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Molbio Diagnostics IPO | మోల్బియో డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ కంపెనీని 2000లో స్థాపించారు. ఈ కంపెనీ అంటువ్యాధులతో పాటు సాధారణ వ్యాధుల కోసం వేగవంతమైన డయాగ్నోస్టిక్ సొల్యూషన్స్ అందిస్తుంది.

రీసెర్చ్, డెవలప్మెంట్, మ్యానిఫ్యాక్చరింగ్, కమర్షియల్ విభాగాలలో ప్రపంచస్థాయి పాయింట్ అఫ్ కేర్ మాలిక్యూలర్ డయాగ్నోస్టిక్ కంపెనీగా గుర్తింపు పొందింది. దీని పోర్ట్‌ఫోలియోలో క్షయ, కోవిడ్-19, హెచ్ ఐవీ, హెచ్ పీవీ, మరియు హెపటైటిస్ బీ మరియు సీ తో సహా 30కి పైగా వ్యాధులున్నాయి. దీని ప్రధాన ఉత్పత్తి అయిన ట్రూనాట్ ప్లాట్‌ఫామ్ ఒక పోర్టబుల్, బ్యాటరీతో పనిచేసే పీసీఆర్ పరికరం. ఇది గంటలోపు ఫలితాలను అందించగలదు. 100కుపైగా దేశాలలో పేటెంట్ ఉంది.

Molbio Diagnostics IPO | రూ. 939.70 కోట్లు సమీకరించనున్న కంపెనీ..

ఐపీవో (IPO) ద్వారా కంపెనీ మొత్తం రూ. 939.70 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ ఫ్రెష్ ఇష్యూ కింద ఒక రూపాయి ఫేస్ వ్యాల్యూ కలిగిన 24,80,246 షేర్లను విక్రయించి రూ. 200 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఒక రూపాయి ఫేస్ వ్యాల్యూ కలిగిన 91,66,000 షేర్లను విక్రయించి రూ. 740 కోట్లు సమీకరించనున్నారు. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Molbio Diagnostics IPO | ప్రైస్ బ్యాండ్ ..

కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ప్రైస్ బ్యాండ్‌ను రూ. 768 నుంచి రూ. 807 లుగా నిర్ణయించింది. ఒక లాట్‌లో 18 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,526 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

Molbio Diagnostics IPO | కోటా, జీఎంపీ..

క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎనఐఐలకి 15 శాతం వాటాను కేటాయించారు. మోల్బియో డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 132 గా ఉంది. అంటే ఐపీవో అలాట్ అయిన వారికి లిస్టింగ్ డే రోజున సుమారు 16 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

ముఖ్యమైన తేదీలు : ఐపీవో బిడ్డింగ్ ఆగస్టు 10న ప్రారంభమైంది. 12వ తేదీతో సబ్‌స్క్రిప్షన్ గడువు ముగుస్తుంది. కంపెనీ షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ ఈనెల 13వ తేదీ రాత్రి వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు 17న బీఎస్ ఈ, ఎన్ ఎస్ ఈలలో లిస్ట్ అవుతాయి.

ఇది కూడా చదవండి..: Dhoot Transmission IPO | ఐపీవోకు ఎలక్ట్రికల్ కంపెనీ.. 30 శాతం లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *