Har Ghar Tiranga | ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Har Ghar Tiranga | ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని అర్బన్ (Nizamabad) ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ ( MLA Dhanpal Suryanarayana) సూచించారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని బ​స్టాండ్​ వద్ద త్రివర్ణ పతకాలను పంపిణీ చేశారు.

Har Ghar Tiranga | స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో..

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ప్రతి సంవత్సరం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేవలం స్వాతంత్ర దినోత్సవం ఒక్కరోజు జెండా ఎగురవేయడమే కాకుండా ఇంటిపై నిత్యం రెపరెపలాడాలన్నారు. అలాగే ఈనెల 14న జరిగే తిరంగా ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, ఫ్లోర్​లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

6766

ఇది కూడా చదవండి: Jharkhand Student Protest | జార్ఖండ్​లో విద్యార్థులపై లాఠీఛార్జ్​ తప్పు : రాహుల్​ గాంధీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *