అక్షరటుడే, వెబ్డెస్క్: delhi-nakili-call | తెలంగాణ Telangana ప్రజలను లక్ష్యంగా చేసుకుని నకిలీ లోన్ ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న కాల్ సెంటర్ల నెట్‌వర్క్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఛేదించారు.
ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మూడు నకిలీ కాల్ సెంటర్లపై పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 21 మంది టెలికాలర్లను అదుపులోకి తీసుకున్నారు.
delhi-nakili-call | ఆర్థిక సంస్థ బజాజ్ ఫైనాన్స్ పేరుతో..
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ముఠా ప్రముఖ ఆర్థిక సంస్థ బజాజ్ ఫైనాన్స్ పేరును ఉపయోగిస్తూ ప్రజలకు ఫోన్ చేసేది. తక్కువ వడ్డీతో ఆకర్షణీయమైన రుణాలు ఇప్పిస్తామంటూ బాధితులను నమ్మించేవారు. అనంతరం లోన్ ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఫీజు, బీమా ప్రీమియం వంటి వివిధ కారణాలు చెబుతూ డబ్బులు వసూలు చేసేవారని అధికారులు గుర్తించారు.
delhi-nakili-call | మూడు నకిలీ కాల్ సెంటర్లు..
ఢిల్లీలోని శివ మార్కెట్ ప్రాంతంలో ఈ మూడు నకిలీ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్కడ పనిచేస్తున్న 21 మంది మహిళా టెలికాలర్లతో పాటు ఓ బ్యాంకు ఖాతాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన టెలికాలర్లంతా తెలంగాణకు చెందినవారేనని అధికారులు తెలిపారు.
Toxic Trailer Review | టాక్సిక్ ట్రైలర్ రివ్యూ : నాలుగు నిమిషాల్లో పిచ్చెక్కించిన టాక్సిక్ వరల్డ్
delhi-nakili-call | పరారీలో నిందితులు..
ఈ వ్యవహారం వెనుక ప్రధాన నిర్వాహకులుగా లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
నకిలీ లోన్ ఆఫర్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. రుణం మంజూరు చేస్తామని చెప్పి ముందుగా ప్రాసెసింగ్ ఫీజు లేదా ఇతర ఛార్జీల పేరుతో డబ్బులు అడిగే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.