అక్షరటుడే, వెబ్‌డెస్క్ : JP Nadda | కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సవాల్ విసిరారు. తాము సభలో చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాహుల్ గాంధీ సభకు రావాలన్నారు.
జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, విపక్షాలు సభను అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై నడ్డా స్పందించారు. కాంగ్రెస్ నాయకులు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని కోరారు. జంతర్ మంతర్ వద్ద ఎలాంటి కాల్పులు జరగలేదన్నారు. అలాగే అక్కడ కాల్పులు జరపాలని ఎటువంటి ఆదేశాలు కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.
JP Nadda | చర్చ నుంచి పారిపోవద్దు
చర్చ నుండి పారిపోవద్దని రాహుల్ గాంధీకి నడ్డా సూచించారు. సభలో ప్రతి అంశంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ రోజు జార్ఖండ్ (Jharkand)లోని విద్యార్థుల గొంతుకలు ఆయనకు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాంచీలో ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. వారు ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉంటూ.. విద్యార్థులపై దాడి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు, అరాచకాన్ని సృష్టించడం, ప్రతికూల రాజకీయాలు చేయడం అని విమర్శించారు.
JP Nadda | గందరగోళాన్ని సృష్టిస్తున్నారు
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు సభలో చర్చ జరగకుండా గందరగోళాన్ని సృష్టిస్తున్నారని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట నీట్‌పై చర్చ జరగాలని డిమాండ్ చేశారని, దానికి తాము ఒప్పుకున్నామని తెలిపారు. తర్వాత రామమందిర ట్రస్ట్ అంశాన్ని లేవనెత్తారని, ఇప్పుడు జంతర్ మంతర్ ఘటనపై హోం మంత్రి ప్రకటన చేయాలని పట్టుబట్టారన్నారు. సభ సజావుగా సాగకుండా అడ్డుకోవడమే ఆయన ఉద్దేశమని మండిపడ్డారు. హోం మంత్రి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
#WATCH | Delhi: Union Minister JP Nadda says, “I once again challenge Rahul Gandhi: Come to the House. We are ready for a discussion, and you will receive a befitting reply. I would also like to clarify: Do not spread misinformation; no bullets were fired at Jantar Mantar, nor… pic.twitter.com/mMMoW2A6aX
— ANI (@ANI) August 10, 2026
దీనిని కూడా చదవండి : Fishermen Accident Insurance | మత్స్యకారులకు ప్రభుత్వం భరోసా.. రూ.5 లక్షల ప్రమాద బీమా