అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Weather | తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో మంగళవారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రివేళ వాన పడుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయి. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది.
Telangana Weather | మళ్లీ ఎల్నినో ప్రభావం
రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. అయితే ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో లోటు వర్షపాత నమోదు అవుతుందని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు. రానున్న 7 నుంచి 10 రోజుల్లో పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు అవుతుంది. మిగతా జిల్లాల్లో తక్కువ వర్షాలు కురుస్తాయి. ఆగస్టు 20 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పడుతాయి.
ఇది కూడా చదవండి..: delhi-nakili-call | ఢిల్లీ కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్ల మోసం.. 21 మంది తెలంగాణ వాసుల అరెస్టు