అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Losses | పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఆందోళనలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. నష్టపరిహారం విషయంలో అమెరికా, ఇరాన్‌లు పరస్పరం డిమాండ్లు చేసుకుంటున్నాయి.
Stock Market Losses | హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే
హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని తిరిగి తెరవాలంటే వాషింగ్టన్ ఆంక్షలను ఎత్తివేయాలని టెహ్రాన్.. ఇరాన్ చంపిన, తీవ్రంగా గాయపరిచిన ప్రజలందరికీ ఆ దేశమే నష్టపరిహారం చెల్లించాలని అమెరికా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా -ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు సన్నగిల్లుతుండడంతో ముడి చమురు ధరలు పెరుగుతూ బ్యారెల్‌కు 90 డాలర్లకు చేరువయ్యాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలుండడంతో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ ఒత్తిడికి గురవుతున్నాయి.
Stock Market Losses | స్వల్ప నష్టాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 33 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 438 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 140 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 418 పాయింట్ల నష్టంతో 78,123 వద్ద, నిఫ్టీ 134 పాయింట్ల నష్టంతో 24,449 వద్ద ఉన్నాయి. టెక్ స్టాక్స్ రాణిస్తున్నా.. ఇండెక్స్‌లలో హెవీ వెయిట్ స్టాక్స్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ అమ్మకాల ఒత్తిడికి గురవుతుండడంతో ప్రధాన సూచీలు నష్టాల బాటలో సాగుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 7 స్టాక్స్ లాభాలతో, 23 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్సీఎల్ టెక్ 0.94 శాతం, టైటాన్ 0.89 శాతం, ఇన్ఫోసిస్ 0.71 శాతం, టెక్ మహీంద్రా 0.60 శాతం, టీసీఎస్ 0.11 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : అల్ట్రాటెక్ సిమెంట్ 2.53 శాతం, ఇండిగో 1.91 శాతం, పవర్‌గ్రిడ్ 1.37 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.33 శాతం, ఎయిర్‌టెల్ 1.24 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Aug 11 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ