Parliament Campus Tension | పార్లమెంట్​ ఆవరణలో ఉద్రిక్తత

పార్లమెంట్ ఆవరణలో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Parliament Campus Tension | పార్లమెంట్ ఆవరణలో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రతిపక్ష, ఎన్డీఏ ఎంపీలు ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పార్లమెంట్‌కు హాజరై ఢిల్లీలో విద్యార్థి నిరసనకారులపై పోలీసుల అణచివేత గురించి వివరించాలని విపక్ష ఎంపీలు డిమాండ్​ చేశారు. అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై చర్చ జరపాలని డిమాండ్​ చేస్తూ.. ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. మరోవైపు హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ ఒక జూనియర్ భాగస్వామిగా ఉన్న జార్ఖండ్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో, అధికార పార్టీ ఎంపీలు ప్రతి నిరసన చేపట్టి, రాహుల్ గాంధీ చర్చల నుండి పారిపోతున్నారని, ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు.

Parliament Campus Tension | పోటాపోటీగా నినాదాలు

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ ఇతర ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ప్లకార్డులు, బ్యానర్‌తో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్డీఏ, విపక్ష ఎంపీలు పోటాపోటీగా నినాదాలు చేశారు. సభ కార్యకలాపాలు ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు అనుమతిస్తే, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు షా సిద్ధంగా ఉన్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Prakash Raj SIR | ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగింపు.. కేంద్రంపై ప్రకాష్ రాజ్ విమర్శలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *