Aug 12 Horoscope | లాభాలను తెచ్చే కొత్త పెట్టుబడులు.. లక్ష్మీదేవి కటాక్షం పొందే రాశుల వారు వీరే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aug 12 Horoscope | ద్వాదశ రాశి ఫలాలు నేడు (బుధవారం, ఆగస్టు 12) గ్రహాల అనుకూలతతో పాటు కొన్ని హెచ్చుతగ్గులతో మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు, కుటుంబ పెద్దల నుంచి ఊహించని ఆర్థిక సహాయం అందడం వల్ల పలు రాశుల వారికి రావాల్సిన బకాయిలు సమకూరి, ఆర్థిక కష్టాల నుంచి ఊరట లభించనుంది.

ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, సమయపాలన, సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తే అనుకున్న లక్ష్యాలను సులువుగా సాధించవచ్చు. ప్రేమ, దాంపత్య జీవితాల్లో భాగస్వామి నుంచి లభించే సర్‌ప్రైజ్‌లు రోజంతా ఉత్సాహాన్ని నింపుతాయి.

Aug 12 Horoscope | రాశుల వారీగా..

మేష రాశిAug 12 Horoscope | డబ్బు పొదుపు చేయాలనే మీ ఆలోచన ఇవాళ నెరవేరుతుంది. కొంత ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. ఉద్యోగ మార్పు మీకు ఎంతగానో కలిసివస్తుంది. కొత్త ఉద్యోగంలో మార్కెటింగ్ వంటి అనువైన రంగంలో కీలక బాధ్యతలు లభించే అవకాశం ఉంది.

వృషభ రాశి: Aug 12 Horoscope | టెన్షన్లు, అభిప్రాయభేదాల వల్ల కొంత చిరాకు, అసౌకర్యం కలగవచ్చు. చేసే ప్రతి పనిలోనూ మీ అధికార పరిధి, హోదా స్పష్టంగా కనిపిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేయడానికి సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం మంచిది.

మిథున రాశి: Aug 12 Horoscope | ఇవాళ చాలా చురుకుగా ఉంటారు. కొత్త వ్యాపారాలు, పథకాలు లేదా ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులు రావచ్చు. అందరితో సరదాగా గడిపుతారు. ఇతరులు మీ సలహాల కోసం ఎదురుచూస్తారు , మీ మాటలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.

కర్కాటక రాశి: Aug 12 Horoscope | ఇవాళ చాలా ఉత్సాహంగా ఉంటారు. సకాలంలో జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారు స్నేహితుల నుంచి కొంత ధనాన్ని పొందే అవకాశం ఉంది. సమస్యలను పరిష్కరించడానికి మీ పరపతిని ఉపయోగించాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడటం మంచిది.

Pocharam Srinivas Reddy | పోచారం శ్రీనివాసరెడ్డి చూపు కేసీఆర్​ వైపు.. కాంగ్రెస్​ సర్కారుపై ఘాటు విమర్శలు!

సింహ రాశి: Aug 12 Horoscope | కొత్త పెట్టుబడి అవకాశాలు వస్తాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యాపారంలో కొత్త ఆలోచనలను వెంటనే ఆచరణలో పెట్టడం విజయాన్ని ఇస్తుంది. గతానికి సంబంధించిన ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించవచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ లభించే అవకాశం ఉంది.

కన్యా రాశి: Aug 12 Horoscope | నగలు, అలంకార వస్తువులపై పెట్టుబడులు పెట్టడం లాభదాయకంగా ఉంటుంది. ఆఫీసులో మీ చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు కష్టపడి చేసిన పనికి ఇతరులు గుర్తింపు కొట్టేసే ప్రమాదం ఉంది.

Khelo India Youth Games | ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ ఆతిథ్యం

తులా రాశి: Aug 12 Horoscope | ఆఫీసులో రోజంతా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లోని సున్నితమైన సమస్యలను పరిష్కరించడానికి మీ తెలివితేటలను ఉపయోగించాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ముందుగా వేసుకున్న బడ్జెట్‌కు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం.

వృశ్చిక రాశి: Aug 12 Horoscope | అభిప్రాయ భేదాల వల్ల కోపం, చికాకు కలగవచ్చు. ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మనశ్శాంతి, తృప్తి లభిస్తాయి. అవకాశాల కోసం ఎదురుచూడకుండా మీరే కొత్త అవకాశాలను వెతుక్కుని ముందుకు సాగడం మంచిది.

ధనుస్సు రాశి: యోగా, ధ్యానంతో రోజును ప్రారంభించడం వలన రోజంతా మీలో ఉత్సాహాన్ని, శక్తిని నింపుతుంది. ఇవాళ చేసే పెట్టుబడులు ఆకర్షణీయమైన లాభాలను తెస్తాయి. అయితే వ్యాపార భాగస్వాముల నుంచి కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముంది.

మకర రాశి: ధనాన్ని సురక్షితమైన ప్రదేశంలో ఇన్వెస్ట్ చేయండి, అది భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తుంది. కొత్త క్లయింట్లతో మాట్లాడటానికి, చర్చలు జరపడానికి ఇది చాలా అద్భుతమైన రోజు. వైవాహిక జీవితంలో భాగస్వామి నుంచి ఊహించని అద్భుతమైన సర్‌ప్రైజ్ లభిస్తుంది.

కుంభ రాశి: అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశముంది, ఇది కొంత ఆందోళన కలిగిస్తుంది. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా రోజు అనుకూలంగానే ఉంటుంది. సహ ఉద్యోగుల ప్రవర్తనను, వారి మానసిక స్థితిని గమనిస్తూ వ్యవహరించండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని పఠించండి.

మీన రాశి: రోజు ప్రారంభం అనుకూలంగా ఉన్నప్పటికీ, అనుకోకుండా కొన్ని ఖర్చులు రావడం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. బంధువుల రాక మీ ఊహ కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఇవాళ చేసే ప్రయాణాలు ఆహ్లాదాన్ని, కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని కలిగిస్తాయి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *