అక్షరటుడే వుబ్‌డెస్క్: Modi Book Reading | సోషల్ మీడియా , రీల్స్ కాలంలో యువత పుస్తక పఠన అలవాటును కోల్పోకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్, మై స్ట్రగుల్స్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. నేటి డిజిటల్ యుగంలో పెరుగుతున్న “షార్ట్‌కట్ సంస్కృతి” పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
Modi Book Reading | పుస్తక పఠనమే శ్రీరామరక్ష..
సెకన్ల వ్యవధిలో మారిపోయే రీల్స్, సోషల్ మీడియా మోజులో పడి యువత తమ ఏకాగ్రతను, లోతైన ఆలోచనా శక్తిని కోల్పోతున్నారని మోదీ హెచ్చరించారు. జీవితంలో నిజమైన పాఠాలు నేర్చుకోవడానికి, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ఆత్మకథలు, పుస్తక పఠనం ఎంతగానో తోడ్పడుతాయని తెలిపారు. మహనీయుల జీవిత చరిత్రలు చదవడం ద్వారా వారు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాల స్ఫూర్తిని పొందవచ్చని అన్నారు. కేవలం డిజిటల్ వినోదానికే పరిమితం కాకుండా, యువత పుస్తకాలు చదివే అలవాటును నిరంతరం కొనసాగించాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Ram Nath Kovind book launch:
PM Modi urges youth to read autobiographies, says ‘shortcut will cut you short’. pic.twitter.com/B3NDHVj4vf
— News Arena India (@NewsArenaIndia) August 12, 2026
ఇది కూడా చదవండి: Nandipet CCTV Cameras | నిఘా నేత్రాలతో గ్రామాలకు భద్రత..