Ram Charan Peddi Release | రామ్​చరణ్​ అభిమానులకు గుడ్​న్యూస్​.. పెద్ది చిత్రం విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే!

Naresh Chandan
Ram Charan Peddi Release

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ram Charan Peddi Release | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు గుడ్​న్యూస్​ అందింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆయన తాజా చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.akshara today .jpgram char

Ram Charan Peddi Release | గ్రామీణ నేపథ్యంలో..

ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా స్వయంగా వెల్లడించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా, రామ్ చరణ్ కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకోనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బుచ్చిబాబు సానా గతంలో రూపొందించిన చిత్రాలు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చినందుకు మంచి పేరు తెచ్చుకున్నాయి. అదే శైలిలో ‘పెద్ది’ కూడా బలమైన కథా నిర్మాణంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.

Ram Charan Peddi Release | పాన్​ ఇండియా నటుడిగా..

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి భారీ విజయాల తర్వాత ఆయన చేసే ప్రతి ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటున్నాయి. ‘పెద్ది’ కూడా అలాంటి భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటోంది.

సినిమాలో రామ్ చరణ్ లుక్, కథా నేపథ్యం, సంగీతం వంటి అంశాలపై త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. విడుదల తేదీ ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.

Ashu Reddy Case | ప్రేమ పేరుతో రూ.9 కోట్లు మోసం.. అషురెడ్డిపై కేసు నమోదు

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *