అక్షరటుడే వెబ్‌డెస్క్: Prakash Raj Vote | ఎలక్టోరల్ రోల్ (SIR) ప్రక్రియలో భాగంగా నటుడు ప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపు అంశంపై వివాదం ఇంకా కొనసాగుతోంది. ప్రకాశ్ రాజ్ ఓటును నిబంధనల ప్రకారమే మార్చామని, ఆయన ఫారమ్-6 సమర్పించి ఓటు హక్కును తిరిగి పొందవచ్చని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ప్రకాశ్ రాజ్ ‘ఎక్స్’ వేదికగా మరో వీడియోను విడుదల చేస్తూ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను వీడియో చేయడంతోనే అధికారులు హుటాహుటిన తన ఓటును మళ్లీ నమోదు చేశారని, మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. తాను వీడియో పెట్టిన గంటల వ్యవధిలోనే మిలియన్ల మంది చూశారని, ఆ వెంటనే అధికారులు తనకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని, సరిదిద్దుతామని చెప్పారన్నారు.
Prakash Raj Vote | తప్పుడు ప్రచారం చేస్తున్నారని..
అయితే, సాయంత్రానికల్లా తాను ఆ అడ్రస్‌లో ఉండటం లేదని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, తాను చెప్పినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన అన్ని కాల్ రికార్డులు తన వద్దే ఉన్నాయని స్పష్టం చేశారు. సాయంత్రానికి బీఎల్ఓను కెమెరాతో పంపి చుట్టుపక్కల వారితో మాట్లాడించి గోదీ మీడియా హల్ చల్ చేసిందని ఆయన విమర్శించారు. ఇదంతా ఎలాంటి నాటకం, ఇదేం రాజకీయం అంటూ అధికారులను నిలదీశారు.
ఈసీ అధికారులు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు
తన ఓటు తొలగించలేదని ఈసీ అధికారులు చేసిన ప్రకటనపై స్పందించిన నటుడు ప్రకాష్ రాజ్
నా ఓటు తొలగించారని వీడియో చేశాక నాకు ఫోన్ చేసి పొరపాటు జరిగింది అని అధికారులు చెప్పిన కాల్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి
దయచేసి సోషల్ మీడియాలో వీడియో… https://t.co/U9MQM6oU7O pic.twitter.com/xSQKq8Qhip
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2026
ఇది కూడా చదవండి: Kiren Rijiju | విపక్షాలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం