అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tata Sons Chairman | టాటా సన్స్ ఛైర్మన్‌గా మరోసారి కొనసాగకూడదని ఎన్ ఛైర్మన్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో కొత్త ఛైర్మన్ ఎంపికపై టాటా ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది.
ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ (N. Chandrasekaran) నుంచి నామినీ డైరెక్టర్లకు ఈ మెయిల్ వచ్చిందని ట్రస్ట్ తెలిపింది. 2027 ఫిబ్రవరి 20న ముగియనున్న తన ప్రస్తుత పదవీకాలం తర్వాత, ఛైర్మన్‌గా తిరిగి నియమితులయ్యేందుకు తాను ఆసక్తి చూపడం లేదని ఆయన తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఆయన నిర్ణయాన్ని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (SDTT) గౌరవిస్తుందని తెలిపింది. దశాబ్ద కాలంలో టాటా సన్స్, టాటా గ్రూప్‌లకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలను తెలియజేశారు.
Tata Sons Chairman | త్వరలో కొత్త కమిటీ
గ్రూప్ స్థాయిలో గణనీయమైన మార్పులు, వృద్ధి, పరివర్తన చోటుచేసుకున్న కాలంలో ఆయన సహకారం అందించారని కొనియాడింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు కొత్త ఛైర్మన్‌ను సిఫార్సు చేసేందుకు, టాటా సన్స్ ‘ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్’ (నియమావళి) ప్రకారం వీలైనంత త్వరగా ఒక ఎంపిక కమిటీని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించాలని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ ట్రస్టీలు తీర్మానించారు. టాటా సన్స్, టాటా గ్రూప్ విలువలు, దీర్ఘకాలిక ప్రయోజనాలకు అనుగుణంగా, నాయకత్వ మార్పు ప్రక్రియ సజావుగా, సకాలంలో మరియు క్రమబద్ధంగా జరిగేలా చూసుకోవడంలో మేము టాటా సన్స్‌కు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి..: Stock Market Losses | మూడో సెషన్లోనూ నష్టాల్లోనే సూచీలు