అక్షరటుడే వెబ్‌డెస్క్: Indus Waters Treaty | సింధూ జలాల ఒప్పందం విషయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ( Shehbaz Sharif )మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. సింధూ జలాల్లో తమకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును ‘రెడ్‌లైన్’గా పరిగణిస్తామని హెచ్చరించారు. తమ నీటి హక్కులను హరించేలా భారత్ ఎలాంటి చర్యలకు పాల్పడినా దీటుగా బదులిస్తామని ప్రగల్బాలు పలికారు. పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్లామాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Indus Waters Treaty | గట్టిగా బదులిస్తామని ..
పాకిస్థాన్ శాంతిని కోరుకుంటున్నప్పటికీ, దాన్ని తమ బలహీనతగా భావించకూడదని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. తమ సార్వభౌమత్వానికి, రక్షణ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని, గతేడాది మే నాటి కంటే గట్టిగా బదులిస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో జరిగిన ఘర్షణల్లో తామే విజయం సాధించామంటూ అసత్య ప్రచారానికి తెరలేపారు. అందువల్లే భారత్ ఏకపక్షంగా సింధూ జలాలను నిలిపివేసిందంటూ నిరాధార ఆరోపణలు గుప్పించారు.
Indus Waters Treaty | నేపథ్యం ఇదీ..
2025 ఏప్రిల్‌లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం.. పాకిస్థాన్‌తో కుదిరిన సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. దీనివల్ల పాక్‌లో తాగు, సాగునీటి సమస్య తీవ్రమైంది. దీంతో జలాలను విడుదల చేయాలంటూ ఆ దేశం పదేపదే డిమాండ్ చేస్తోంది.
అయితే, నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని.. సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపితేనే ఈ అంశంపై చర్చిస్తామని భారత్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఏ అంతర్జాతీయ ఒప్పందమైనా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఒక సార్వభౌమ దేశంగా దానిని నిలిపివేసే లేదా రద్దు చేసే పూర్తి హక్కు భారత్‌కు ఉందని తేల్చిచెప్పింది.
ఇది కూడా చదవండి: Nagarjuna Sagar Flood | నాగర్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద