Sriramsagar Project | శ్రీరాంసాగర్​కు తగ్గిన వరద

శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్ట్​కు వరద ప్రవాహం తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం నిలకడగా ఉంది.

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా: Sriramsagar Project | శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్ట్​కు వరద ప్రవాహం తగ్గిపోయింది. ఎగువన వర్షాలు లేకపోవడంతో జలశయానికి ఇన్​ఫ్లో తగ్గింది.

1,013 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..

ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriramsagar Project)లోకి 1,013 క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు, పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1079.50 అడుగుల వద్ద 43.669 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్​ నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 482 క్యూసెక్కులు నీళ్లు బయటకు వెళ్తున్నాయి.

ఇది కూడా చదవండి..: Nizamabad Hotel Checks | నగరంలోని హోటళ్లలో పోలీసుల తనిఖీలు.. అనుమానిత వ్యక్తులపై ఆరా..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *